సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం

Jul 15 2026 12:05 PM | Updated on Jul 15 2026 12:05 PM

డీఎస్‌ఓ తనూజ

డీఎస్‌ఓ తనూజ

దుబ్బాక: వర్షాకాలంలో ప్రబలే సీజనల్‌ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట జిల్లా పౌర సరఫరాల అధికారి(డీఎస్‌ఓ) తనూజ అన్నారు. మంగళవారం కలెక్టర్‌ హైమావతి ఆదేశాల మేరకు దుబ్బాక మండలం హబ్షీపూర్‌లో పర్యటించారు. గ్రామంలోని పాఠశాలలతోపాటు పలు కాలనీల్లో సందర్శించి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామస్తులకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మండలంలోని 21 గ్రామాలలో పాఠశాలలు, వసతి గృహాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించనున్నామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శ్రీలత, ఎంపీడీవో సోమిరెడ్డి, ఎంపీఓ మురళి, కార్యదర్శి వజ్ర తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement