కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

Jul 15 2026 12:05 PM | Updated on Jul 15 2026 12:05 PM

బీఎంఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వామి

బీఎంఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వామి

గజ్వేల్‌: ఆర్‌టీసీ కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీఎంఎస్‌ పనిచేస్తోందని ఆ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర స్వామి అన్నారు. గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ ఆర్‌టీసీ డిపోలో మంగళవారం నిర్వహించిన నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ కార్మికులకు ఎలాంటి ఇబ్బందులున్నా.. వాటి పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. నూతన కమిటీ అధ్యక్షురాలిగా లక్ష్మి, కార్యదర్శిగా సాయికిశోర్‌, కోశాధికారిగా ఎం.శ్రీనివాస్‌ తదితరులు ఎంపికయ్యారు. కార్యక్రమంలో సంఘం నాయకులు మరాఠి కృష్ణమూర్తి, తిరుపతిగౌడ్‌, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement