హుస్నాబాద్: ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న అక్రమదారులపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఇరిగేషన్ డిప్యుటీ ఇంజనీర్ శ్రీనివాస్‌కు మంగళవారం వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ పట్టణ శివారులోని కుమ్మరికుంటలో కొంతమంది అక్రమంగా మట్టి తవ్వి తరలిస్తున్నారన్నారు. అలాగే కుంటలోని కొంత భూమిని ఆక్రమించారని, అధికారులు హద్దులు నిర్ణయించి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే రహదారుల పేరిట గుట్టలను తవ్వి మట్టిని తరలించి ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. అక్రమదారుల నుంచి కుంటను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు మల్లికార్జున్‌రెడ్డి, విజయభాస్కర్, తిరుపతి నాయక్, రమేశ్ పాల్గొన్నారు.
‘జబర్దస్త్’ నటి ఫైమా సందడి
దుబ్బాకటౌన్: జబర్దస్త్ హాస్యనటి ఫైమా దుబ్బాక మైనారిటీ గురుకులంలో మంగళవారం సందడి చేశారు. ఈ గురుకులం ప్రత్యేకత తెలుసుకొని తన అక్క కొడుకుని చేర్పించారు. అనంతరం విద్యార్థులకు జోకులు చెప్పి నవ్వించారు. ఈ మైనారిటీ గురుకులాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఆమెను శాలువాతో సన్మానించారు.
విద్యార్థులకు షూస్ అందజేత
గజ్వేల్‌రూరల్: విద్యార్థులు చదువుల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మండలంలోని అహ్మదీపూర్ కాంప్లెక్స్ హెచ్‌ఎం సుగుణాకర్ సూచించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు గజ్వేల్‌కు చెందిన ఎర్ర సత్యం మంగళవారం షూస్ పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు దాతల సహకారాన్ని సద్వినియో గం చేసుకుంటూ ఉన్నతులుగా ఎదగాలన్నా రు. కార్యక్రమంలో హెచ్‌ఎం సుధాకర్, ఉపాధ్యాయుడు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
ఆ పాపం బీఆర్‌ఎస్‌దే..
బెజ్జంకి(సిద్దిపేట): ఇథనాల్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు అనుమతినిచ్చి పాపం చేసింది బీఆర్‌ఎస్ పార్టీయేనని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ ఆరోపించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచ్‌ల ఫోరం మండ ల అధ్యక్షుడు శ్రీకాంత్‌తో కలిసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిబంధన లు పట్టించుకోకుండా వారి సర్పంచ్‌లు తీర్మానాలు చేయడం వల్లే మండల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. ఫ్యాక్ట రీ అనుమతులపై ఎమ్మెల్యేను కానీ, పార్టీని కానీ విమర్శిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.
పల్లెల అభివృద్ధికి ప్రాధాన్యం
చిన్నకోడూరు(సిద్దిపేట): పల్లెల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని పద్మశాలి కో–ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. మండల పరిధిలోని అల్లీపూర్‌లో రూ.20 లక్షలతో నిర్మించే సీసీ రోడ్లకు ఏఎంసీ చైర్మన్ మీసం మహేందర్‌తో కలిసి మంగళవారం భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గ్రామాలు అభివృద్ధిలో కుంటుపడ్డాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం, ఆర్‌టీఏ మెంబర్ డా.సూర్యవర్మ, ఏఎంసీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ శంకర్, నాయకులు సాకి ఆనంద్, చంద్రశేఖర్, పరశురాములు, రాజేశ్ పాల్గొన్నారు.


