డీఈఓ ఉత్తర్వుల ప్రకారం బాధ్యతలు అప్పగిస్తాం | - | Sakshi
Sakshi News home page

డీఈఓ ఉత్తర్వుల ప్రకారం బాధ్యతలు అప్పగిస్తాం

Jul 15 2026 12:05 PM | Updated on Jul 15 2026 12:05 PM

డీఈఓ ఉత్తర్వుల ప్రకారం బాధ్యతలు అప్పగిస్తాం

ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి

కొండపాక(గజ్వేల్‌): మండలంలోని మర్పడ్గ హైస్కూల్‌ సైన్స్‌ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కల్లెపల్లి శ్రీనివాస్‌కు హెచ్‌ఎంగా పూర్తి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఇన్‌చార్జి డీఈఓ రమేశ్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం శ్రీనివాస్‌కు పూర్తి బాధ్యతలు అప్పగిస్తామని ఎంఈఓ శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ఇక్కడ హెచ్‌ఎంగా పనిచేసిన భైరయ్య 30న పదవీవిరమణ పొందారు. అనంతరం సీనియారిటీ ప్రకారం హైస్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో ఒకరికి బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. కానీ సీనియారిటీ ఉన్న వ్యక్తిపై వచ్చిన అవినీతి ఆరోపణలు దృష్ట్యా జాప్యం జరిగింది.

దాడులను అరికట్టాలని కోరుతూ సీఎంకు వినతి

మిరుదొడ్డి(దుబ్బాక): రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందించినట్టు డీబీఎఫ్‌(దళితబహుజన ఫ్రంట్‌) జాతీయ కార్యదర్శి పి.శంకర్‌ తెలిపారు. మిరుదొడ్డిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల అత్యాచా రాల నిరోధక చట్టాలపై హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన హైపవర్‌ కమిటీ సమావేశం నిర్వహించామన్నారు. అత్యాచారాలు, దాడులపై చర్చించి వాటిని అరికట్టా లని కోరుతూ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్యతో కలిసి సీఎంకు వినతిపత్రం అందించినట్టు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కల్పన పాల్గొన్నారు.

ప్రజాస్వామ్యంపై అవగాహన

హుస్నాబాద్‌రూరల్‌: ప్రజాస్వామ్య పద్ధతిలో నాయకులను ఎన్నుకునే విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు జ్యోతిరావ్‌ఫూలే బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ వీణాచందన చెప్పారు. పోతారం(ఎస్‌)లో గురుకుల పాఠశాల విద్యార్థి కౌన్సిల్‌, హెడ్‌ గర్ల్‌ ఎంపికకు మంగళవారం ఓటింగ్‌ ప్రక్రియ చేపట్టారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అందరికీ స్వేచ్ఛ, పోటీచేసే అవకాశం ఉంటుందన్నారు.

ఆక్రమిస్తే చర్యలు తప్పవు

వర్గల్‌(గజ్వేల్‌): ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్‌ శ్రీకాంత్‌ హెచ్చరించారు. ఒడ్డెర, యాదవ కులస్తుల మధ్య వివాదం తలెత్తిన నేపథ్యంలో మంగళవారం ఆయన వర్గల్‌ శివారులోని సర్వే నంబర్‌ 1045 ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఆ భూమిలో అనుమతి లేకుండా ఇళ్లు నిర్మిస్తే చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట గిర్ధావర్‌ ప్రవీణ్‌, భగత్‌ తదితరులున్నారు.

ఓపీ సేవల సమయం పెంచండి

సిద్దిపేటకమాన్‌: ప్రభుత్వాసుపత్రిలో ఓపీ సేవల సమయాన్ని పెంచి, సకాలంలో వైద్య సేవలందించాలని డీవైఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు. వారు మంగళవారం ప్రభు త్వ ఆస్పత్రి సందర్శించారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత కూడా ఓపీ సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement