మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మి
హుస్నాబాద్: పారిశుద్ధ్య, వ్యర్థాల సేకరణ కార్మికుల ఆరోగ్య భద్రతే తమ ధ్యేయమని మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నమస్తే పథకంలో భాగంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న వ్యర్థాల సేకరణ కార్మికులకు మంగళవారం ఆయుష్మాన్ భారత్ కార్డులు, పీపీఈ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నమస్తే పథకం ద్వారా వ్యర్థాల సేకరణ కార్మికుల సామాజిక భద్రత, గౌరవప్రదమైన జీవనం, వృత్తి పరమైన రక్షణ కల్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, కో–ఆప్షన్ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
సిద్దపేటలో..
సిద్దిపేటజోన్: మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ సూచనల మేరకు శానిటరీ ఇన్‌స్పెక్టర్ మహేశ్, ఎన్విరాల్మెంట్ ఇంజనీర్ అన్వేష్ పారిశుద్ధ్య కార్మికులకు పీపీటీ కిట్‌లు పంపిణీ చేశారు. వారు మాట్లా డుతూ విధుల నిర్వహణలో తప్పనిసరి జాగ్రత్తలు పాటించాలన్నారు. చెత్త సేకరణ సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కోరారు.


