19 ఏళ్ల పిల్లలందరికీ వేయించాలి
కలెక్టర్ హైమావతి
కొండపాక(గజ్వేల్): నట్టల నివారణ కోసం 1 నుంచి 19 ఏళ్ల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. నులిపురుగుల నివారణ దినోత్సవా న్ని పురస్కరించుకొని కొండపాక మండలంలోని దుద్దెడలో గల హైస్కూల్‌ల్లో విద్యార్థులకు మాత్ర లు వేశారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా హైమావతి మాట్లాడుతూ ఎదిగే వయస్సులో పిల్లలు వ్యాధులకు గురైతే సరైన ఎదుగదల ఉండకపోవడంతో వివిధ రకాల సమస్యలతో బాధపడాల్సి వస్తుందన్నారు. ఆరోగ్య విషయంలో పిల్లలు తగు జాగ్రత్తలు తీసు కునేలా తల్లిదండ్రులు చూసుకోవాలన్నారు. కడుపు లో నులిపురుగులు ఉంటే.. ఆకలి మందగించడంతో పాటు ఎప్పుడూ నీరసంగా కనిపించే లక్షణా లుంటాయన్నారు. మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ ధన్‌రాజ్, ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి, హెచ్‌ఎం లక్ష్మి, సర్పంచ్ శివకుమార్, అధికారులు పాల్గొన్నారు.


