సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సిద్దిపేట నియోజకవర్గ బీఆర్‌ఎస్ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. తమ రక్తంతో రైతుల కష్టాలు తీరుతాయంటే రక్తం చిందించడానికి బీఆర్‌ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ‘ఇదిగో మా రక్తం తీసుకోండి.. రైతులకు నీళ్లివ్వండి’ అంటూ రక్తదానం చేశారు. సేకరించిన రక్తం ప్యాకెట్లను సీఎం ఇంటికి పంపిస్తామని వారు అన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాయిరాం నాయకులు మోహన్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.
– సిద్దిపేటజోన్


