సర్‌పై అలసత్వం వద్దు | - | Sakshi
Sakshi News home page

సర్‌పై అలసత్వం వద్దు

Jul 14 2026 6:52 AM | Updated on Jul 14 2026 6:52 AM

● యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి ● ఒక్క ఓటూ తప్పిపోవద్దు ● కలెక్టర్‌ హైమావతి

● యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి ● ఒక్క ఓటూ తప్పిపోవద్దు ● కలెక్టర్‌ హైమావతి

సిద్దిపేటజోన్‌: సమగ్ర ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(సర్‌) ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని కలెక్టర్‌ హైమావతి పిలుపుని చ్చారు. సోమవారం మున్సిపల్‌ కార్యాలయంలో సిద్దిపేట పట్టణ పరిధిలో సర్‌ ప్రక్రియ తీరుతెన్ను లు, ప్రస్తుత పరిస్థితులు గూర్చి సమీక్ష నిర్వహించా రు. జిల్లా కేంద్రంలో ఆశించిన స్థాయిలో పురోగతి లేదని అధికారులు, సిబ్బందిని కలెక్టర్‌ కారణాలు అడిగి తెలుసుకున్నారు. తక్కువ శాతం నమోదైన సూపర్‌ వైజర్లు, బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు పై ఆగ్రహం వ్యక్తంచేశారు. పట్టణంలో ఒక్క ఓటు తప్పిపోవద్దని, అదేవిధంగా రెండు చోట్ల ఒకరికి ఓటు ఉండకూడదని స్పష్టం చేశారు. అత్యంత పారదర్శకంగా విధులను నిర్వర్తించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సక్రమంగా విధులను నిర్వహించకపోతే ,అలసత్వం వహిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున్‌ కు సూచించారు. బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు తప్పనిసరి ఇంటింటికి వెళ్లి పూరించిన ఎన్యుమరేషన్‌ పత్రాలను సేకరించాలని ఆదేశించారు. సమావేశంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ భవ్య, ఆర్డీఓ సదానందం, మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున్‌, తహశీల్దార్‌ హరి కిరణ్‌, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement