సీపీ రష్మీ పెరుమాళ్
సిద్దిపేటకమాన్: పోలీసు సిబ్బంది రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించడం అభినందనీయమని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. మల్కాజ్‌గిరి పోలీసు కమిషనరేట్‌లో ఇటీవల జరిగిన తెలంగాణ పోలీసు గేమ్స్ అండ్ స్పోర్ట్స్‌లో ప్రతిభ కనబర్చి పతకాలు సాధించిన పోలీసు సిబ్బందిని సీపీ సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి పోటీల్లో కమిషనరేట్ నుంచి పాల్గొన్న ఆర్‌ఎస్‌ఐ పి.రోహిత్ పవర్‌లిఫ్టింగ్ 83 కేజీల విభాగంలో బంగారు పతకం, అలాగే ఎస్‌ఐ అంజయ్య కరాటే 84 కేజీల విభాగంలో బంగారు పతకం, కానిస్టేబుల్ ఎన్.అనిల్‌కుమార్ కరాటే 75 కేజీల విభాగంలో కాంస్య పతకంసాధించారన్నారు. ఏఆర్ పీసీ భరత్ త్వైకాండో 74కేజీల విభాగంలో కాంస్య పతకం, ఏఆర్ మహిళా కానిస్టేబుల్ డి.శ్రావణి యోగాలో ప్రతిభ చాటి కాంస్య పతకాన్ని గెలు చుకున్నట్లు సీపీ తెలిపారు. ప్రాజెక్టు సిద్ధి కార్యక్రమంలో యోగా నేర్చుకుని మొదటి ప్రయత్నంలోనే పతకం సాధించడం అభినందనీయమన్నారు.


