హుస్నాబాద్‌లో నేడు మంత్రుల పర్యటన | - | Sakshi
Sakshi News home page

హుస్నాబాద్‌లో నేడు మంత్రుల పర్యటన

Jul 10 2026 9:51 AM | Updated on Jul 10 2026 9:51 AM

హుస్నాబాద్‌లో నేడు మంత్రుల పర్యటన హుస్నాబాద్‌: నియోజకవర్గంలో శుక్రవారం మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు అక్కన్నపేట మండలం జనగామలో ఆయిల్‌పామ్‌ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. 10.30 గంటలకు హుస్నాబాద్‌ మండలం తోటపల్లిలో ఏటీసీ నిర్మాణ పనులకు భూమి పూజ చేస్తారు. అనంతరం 11 గంటలకు ఉమ్మాపూర్‌ గుట్టల్లో ఇంజనీరింగ్‌ కళాశాల నూతన భవన నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. 11.30 గంటలకు హుస్నాబాద్‌లోని తిరుమల గార్డెన్‌లో మెగా జాబ్‌ మేళా, టామ్‌ కామ్‌ అవగాహన కార్యక్రమంలో మంత్రులు పాల్గొంటారని మంత్రి క్యాంప్‌ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. జాతీయ పునర్నిర్మాణమే లక్ష్యం ఏబీవీపీ జిల్లా మహిళా కన్వీనర్‌ మృధులయ హుస్నాబాద్‌: దేశ నిర్మాణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ) ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకుందని జిల్లా మహిళా కన్వీనర్‌ మృధులయ అన్నారు. జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా గురువారం పట్టణంలో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మృధులయ మాట్లాడుతూ ఐదుగురు విద్యార్థులతో ప్రారంభమైన ఏబీవీపీ నేడు 78 లక్షల మంది విద్యార్థుల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్ధి సంఘంగా నిలిచిందన్నారు. జాతీయ వాదాన్ని పెంపొందించుటకు అనేక మంది కార్యకర్తలు ప్రాణ త్యాగాలు చేశారని గుర్తు చేశారు. భారత దేశాన్ని విశ్వ గురువుగా నిలుపుటకు ఏబీవీపీ చేస్తున్న ప్రయాణంలో ప్రతి విధ్యార్థి భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ నగర కార్యదర్శి రాజు, జిల్లా ఎస్‌ఎఫ్‌డీ కన్వీనర్‌ చరణ్‌, నాయకులు తదితరులు ఉన్నారు.

కేసీఆర్‌ను కలిసిన

డీసీసీబీ డైరెక్టర్‌

ములుగు(గజ్వేల్‌): ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో గురువారం మాజీ సీఎం కేసీఆర్‌ను ఉమ్మడి మెదక్‌ జిల్లా డీసీసీబీ డైరెక్టర్‌, ములుగు పీఏసీఎస్‌ చైర్మన్‌ బట్టు అంజిరెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అంజిరెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్‌కు పూల మొక్కను అందజేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆయన మండల కేంద్రమైన ములుగులో బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులతో కలసి మొక్కలు నాటారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు

మిట్టపల్లి విద్యార్థిని

సిద్దిపేటఅర్బన్‌: రాష్ట్ర స్థాయి అత్యా పాత్యా పోటీలకు అర్బన్‌ మండలం మిట్టపల్లి ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని జి.ప్రణీత ఎంపికయ్యారు. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలలో అండర్‌–14 విభాగంలో ప్రణీత ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ నెల 11, 12 తేదీలలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీలలో విద్యార్థిని పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినిని పలువురు అభినందించారు.

ఉన్ని సహకార

ఎన్నికలు ఏకగ్రీవం

మిరుదొడ్డి(దుబ్బాక): మండల పరిధిలోని ధర్మారంలో ఉన్ని సహకార ఎన్నికలు గురువారం ఏకగ్రీవమయ్యాయి. అధ్యక్షుడిగా కంతుల కొమురయ్య, ఉపాధ్యక్షుడిగా గుట్టయ్య, కార్యదర్శిగా బీరయ్య, డైరెక్టర్లుగా రాజయ్య, లక్ష్మి, మల్లవ్వ, స్వామి, శ్రీనివాస్‌, మల్లయ్యలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణాధికారి రవి నియామక పత్రాలను సంఘం సభ్యులకు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement