చెత్త నుంచి కంపోస్ట్‌ తయారీపై గజ్వేల్‌లో ప్రాంతీయ సదస్సు | - | Sakshi
Sakshi News home page

చెత్త నుంచి కంపోస్ట్‌ తయారీపై గజ్వేల్‌లో ప్రాంతీయ సదస్సు

Jul 10 2026 9:51 AM | Updated on Jul 10 2026 9:51 AM

మున్సిపల్‌ శాఖ సీడీఓ హేమలత

స్వచ్ఛతకు బాటలు

గజ్వేల్‌: ఆధునిక వ్యర్థాల నిర్వహణ పద్ధతులు స్వచ్ఛతకు బాటలు వేస్తాయని మున్సిపల్‌ శాఖ సీడీఓ(కంపోస్ట్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌) హేమలత అన్నారు. గురువారం గజ్వేల్‌లోని డంపు యార్డు వద్ద ‘వేస్ట్‌ టూ కంపోస్ట్‌ విండ్రో’(వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువు తయారీ) అంశంపై మున్సిపాలిటీల ప్రాంతీయస్థాయి అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన హేమలత మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో చెత్తను రీ–సైక్లింగ్‌ చేయడం ద్వారా పర్యావరణను కాపాడుకోవచ్చని సూచించారు. ఈ సందర్భంగా చెత్త నుంచి కంపోస్ట్‌ తయారీ అంశంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చందన, కమిషనర్‌ గణేశ్‌రెడ్డితోపాటు సిద్దిపేట, దుబ్బాక, చేర్యాల, హుస్నాబాద్‌, ముడిచింతలపల్లి, అలియాబాద్‌ మున్సిపల్‌ కమీషనర్లు, శానిటరీ ఇన్స్‌పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement