సిద్దిపేటరూరల్: జిల్లాలో శుక్రవారం చేపట్టనున్న ఆయిల్‌పామ్ మెగా ప్లాంటేషన్ డ్రైవ్‌ను విజయవంతం చేయాలని కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హల్ లో జిల్లాలోనీ వ్యవసాయ శాఖ ఏడీఏ, ఏఓ, ఏఈఓ లతో కలెక్టర్ జూమ్ సమావేశం ద్వారా వ్యవసాయ శాఖ చేస్తున్న కార్యక్రమాల పనితీరు గూర్చి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా మండలాల్లో గుర్తించిన వ్యవసాయ క్షేత్రాలలో ఆయిల్‌పామ్ మొక్కలను నాటాలన్నారు. ఎల్‌నీనో ప్రభావంతో లోటు వర్షపాతం ఉన్నందున నీటి లభ్యత ఉన్న రైతులే వరి పండించాలన్నారు. జిల్లాలో యూరియా కొరత లేదని, ఎకరానికి 2 బ్యాగులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. యూరియా అక్రమంగా అమ్మినట్లు తెలిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ సైతం వేగవంతం చేయాలని, ఇచ్చిన లక్ష్యాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలని, నిర్లక్షం వహించవద్దన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీలో మందకొడిగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ సెలవులు తీసుకోకుండా వచ్చే మూడు రోజుల్లో పూర్తి చేయాలని ఏఈఓ లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఏఓ స్వరూప రాణి, డిహెచ్‌ఓ సువర్ణ, భాస్కర్ తదితరులు ఉన్నారు.
డ్రైవ్‌ను సక్సెస్ చేయాలి
కలెక్టర్ హైమావతి


