దుబ్బాక: దేశంలోనే చేనేత పరిశ్రమకు దుబ్బాక ప్రసిద్ధి చెందిందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికై న దుబ్బాక చేనేత సహకార సంఘం పాలక మండలిని క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత పరిశ్రమకు పూర్వ వైభవం తేవాలన్నారు. గొల్లభామ చీరలతో పాటు చాలా రకాల వస్త్రాలు నేయడంలో అందెవేసిన కార్మికులు ఉన్నారన్నారు. రాష్ట్రంలోనే పెద్ద చేనేత సొసైటీలో ఒకటైన దుబ్బాక పాలకమండలి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషకరమన్నారు. చేనేత కార్మికుల సంక్షేమ కోసం కొత్త పాలకవర్గం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, చేనేత సొసైటీ అధ్యక్షులు అంకం మధు, కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.
పరిశ్రమకు పూర్వ వైభవం తేవాలి
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి


