దుబ్బాక అభివృద్ధికి సీఎం హామీ: ఎమ్మెల్యే కొత్త | - | Sakshi
Sakshi News home page

దుబ్బాక అభివృద్ధికి సీఎం హామీ: ఎమ్మెల్యే కొత్త

Jul 7 2026 6:52 AM | Updated on Jul 7 2026 6:52 AM

దుబ్బాక: నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం సీఎం నివాసంలో కలిసి నియోజకవర్గానికి సంబంధించి పలు అభివృద్ధిపనులకు నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. హబ్షీపూర్‌ చౌరస్తా నుంచి దుబ్బాక పట్టణం వరకు ఉన్న డబుల్‌ రోడ్డును ఫోర్‌లేన్‌ చేయాలని విన్నవించామన్నారు. మున్సిపాలిటీలో నిర్మించనున్న ఆధు నిక నాన్‌వెజ్‌ మార్కెట్‌ కోసం గతంలో మంజూరైన నిధులను తిరిగి విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. అలాగే నియోజకవర్గానికి యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటేడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఆర్‌అండ్‌బీ, పీఆర్‌ రోడ పెండింగ్‌ బిల్లులు క్లియర్‌ చేయాలని కోరామన్నారు. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని కోరడంతో సీఎం సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. సీఎంను కలిసిన వారిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీ కడతల రవీందర్‌రెడ్డి, రణం శ్రీనివాస్‌గౌడ్‌, కొత్త కిషన్‌రెడ్డి, రాజిరెడ్డి తదితరులు ఉన్నారు.

సీపీ ఆకస్మిక తనిఖీలు

సిద్దిపేటజోన్‌: జిల్లా కేంద్రంలో సోమవారం పోలీస్‌ కమిషనర్‌ రష్మీ పెరుమాళ్‌ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. వర్షాకాలం నేపథ్యంలో బల్దియా కమిషనర్‌ మల్లికార్జున్‌తో కలిసి ప్రధాన కూడళ్లలో రహదారులు, గుంతలను పరిశీలించారు. ప్రజల రవాణాకు ఇబ్బందులు లేకుండా త్వరితగతిన గుంతలను పూడ్చాలని సూచించారు. విక్టరీ టాకీస్‌ చౌరస్తా, పాత బస్టాండ్‌ ప్రాంతాల్లో వర్షాలకు వరద నీరు మడుగుగా మారుతూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్‌, పోలీస్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు.

అతిథి అధ్యాపకులకు దరఖాస్తులు

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): జిల్లాలోని మైనార్టీ రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది (అతిథి అధ్యాపకుల) కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి నాగరాజమ్మ తెలిపారు. పీజీటీ ఫిజికల్‌ సైన్స్‌ (మహిళ), పీజీటీ ఇంగ్లిష్‌, బాటనీ జూనియర్‌ లెక్చరర్‌ (మహిళ), కెమిస్ట్రీ జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 8వరకు గజ్వేల్‌ బాలికల మైనార్టీ గురుకులంలో దరఖాస్తులు అందించాలని, అదే గురుకులంలో ఈ నెల 9న సంబంధిత సబ్జెక్ట్‌లో డెమో నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఆరుతడి సాగుతో ఆర్థికాదాయం

మిరుదొడ్డి(దుబ్బాక): ఆరుతడి సాగుతో మంచి ఆర్థికాదాయం సాధించవచ్చని హార్టికల్చర్‌ అధికారి రమేశ్‌ తెలిపారు. సోమవారం మండల పరిధిలోని చెప్యాలలో సాగవుతున్న కూరగాయల పంటలను ఆయన పరిశీలించారు. కూరగాయల సాగుపై రైతులకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి ఎద్దడిని తట్టుకుని ముందుకు సాగాలంటే పప్పుధాన్యాలు, కూరగాయలను పండించాలన్నారు. కొద్దిపాటి నీటి వనరులు ఉన్న చోట నీటిని పొదుపుగా వాడుతూ బీర, కాకర, సొర, చిక్కుడు, దొండ వంటి పంటలను పండించవచ్చన్నారు. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కలిగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement