దుబ్బాక: జిల్లాలో అతిపెద్ద చేనేత సహకార సంఘంగా ప్రసిద్ధి చెందిన దుబ్బాక సహకార సంఘానికి డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం తొమ్మిది మంది డైరెక్టర్లకు 20 మంది నామినేషన్లు వేయగా సోమవారం 11 మంది పోటీ నుంచి వైదొలిగారు. దీంతో డైరెకర్లుగా అంకం మధు, కారంపురి గురుచరణ్, సిరిగాధ నర్సింహులు, బోడ చంద్రమోహన్, రాపెల్లి నాగరాజు, గాజుల భాస్కర్, చెలిమెల రాజేశం, మెత్కు కవిత, గడ్డం రాజమణి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. డైరెక్టర్లకు ఎన్నిక పత్రాలను అందించారు. దుబ్బాక చేనేత సహకార సంఘం డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికావడంపై దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, భూంపల్లి–అక్బర్‌పేట మండలాల్లోని పద్మశాలి, నీలకంఠ సంఘాల నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.
నేడు చైర్మన్, పాలక వర్గం ఎన్నిక
దుబ్బాక చేనేత సహకార సంఘం చైర్మన్‌తో పాటు పూర్తి స్థాయి పాలకవర్గం ఎన్నిక మంగళవారం ఉదయం 11 గంటలకు ఉంటుందని ఎన్నికల అధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.


