వీడని ఉద్యమ కేసులు | - | Sakshi
Sakshi News home page

వీడని ఉద్యమ కేసులు

Jul 7 2026 6:52 AM | Updated on Jul 7 2026 6:52 AM

విముక్తి కల్పించాలనిఉద్యమకారుల వేడుకోలు

చేర్యాల(సిద్దిపేట): రాష్ట్రం సిద్ధించినా ఉద్యమకారులకు తిప్పలు తప్పడం లేదు. నాటి రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో నమోదైన కేసుల విచారణ ఏళ్లు గడుస్తున్నా ముగియడం లేదు. దీంతో విచారణ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఉద్యమకారులు.. ప్రభుత్వం స్పందించి కేసులు ఎత్తివేయాలని కోరుతున్నారు. సోమవారం కేసు విచారణలో భాగంగా పలువురు ఉద్యమకారులు చేర్యాల కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో నమోదైన ఉద్యమ కేసులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై యేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కొనసాగుతున్నాయన్నారు. దీంతో కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కేసులను పూర్తిగా ఉపసంహరించి న్యాయం చేయాలని కోరారు. కోర్టుకు హాజరైన వారిలో హైదరాబాద్‌ జలమండలి చైర్మన్‌ మొగుళ్ల రాజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు ఆరుట్ల దశమంత్‌రెడ్డి, బూరుగు సురేష్‌గౌడ్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు మేకల కళింగరాజు, మాజీ సర్పంచులు వల్లూరి శ్రీనివాస్‌, కోనేటి స్వామి, నాయకులు బూడిద కిష్టయ్య, రఘువీరారెడ్డి, తిప్పారపు ఆనంద్‌, ముషిని బాబు తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement