రిజర్వాయర్‌ రద్దయినా ప్రభుత్వం దగ్గరే భూమి | - | Sakshi
Sakshi News home page

రిజర్వాయర్‌ రద్దయినా ప్రభుత్వం దగ్గరే భూమి

Jul 6 2026 6:54 AM | Updated on Jul 6 2026 6:54 AM

రోడ్ల నిర్మాణానికి రూ. 204 కోట్లు దరఖాస్తుల ఆహ్వానం ● ● తోటపల్లి రిజర్వాయర్‌ కోసం 2007లో శంకుస్థాపన ● 510 మంది రైతుల దగ్గర నుంచి 1,603 ఎకరాల భూమి సేకరణ ● అధ్యయనం చేసి 2015లో రద్దు చేసిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ● 100 ఎకరాల భూమి గ్రావిటీ కెనాల్‌కు వినియోగం ● ఇంకా ప్రభుత్వం అధీనంలోనే 1,503 ఎకరాలు ● తమ భూమి తమకు ఇవ్వాలని వేడుకుంటున్న భూ నిర్వాసితులు

తోటపల్లి రిజర్వాయర్‌ రద్దయి 11 ఏళ్లు గడుస్తున్నా అందుకు సేకరించిన భూమి ఇంకా ప్రభుత్వ అధీనంలోనే ఉంది. రిజర్వాయర్‌ ఎలాగు రద్దయింది కాబట్టి తమ భూమిని తమకిచ్చేయాలని రైతులు వేడుకుంటున్నారు. ప్రస్తుతం ఆ భూముల్లో రైతులు సాగు చేస్తున్నా రికార్డుల్లో లేనందున సదరు రైతులకు రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలేవీ వర్తించడం లేదని వాపోతున్నారు.

– సాక్షి, సిద్దిపేట

ఖేడ్‌ ఎమ్మెల్యే సంజీవరెడ్డి

నారాయణఖేడ్‌: ఖేడ్‌ నియోజకవర్గంలో 29 రహదారుల నెట్‌వర్క్‌ బలోపేతం కోసం హ్యామ్‌ ద్వారా ఆర్‌అండ్‌బీ రోడ్లకు రూ.137 కోట్లు, పంచాయతీరాజ్‌ (పీఆర్‌) రోడ్లకు రూ.67.95 కోట్లు కలిపి మొత్తం రూ. 204.95 కోట్లు విడుదలైనట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అధ్వానంగా మారిన రహదారుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిరంతరం పట్టుబట్టి నిధులను సాధించామన్నారు. ప్రధాన రహదారులు, గ్రామీణ ప్రాంతాల్లోని అంతర్గత, లింకు రోడ్లను నిర్మిస్తామన్నారు. పనులు పూర్తయితే రవాణా ఇబ్బందులు తొలగి నియోజకవర్గ ముఖచిత్రం మారుతుందన్నారు. త్వరలోనే పనులకు శంకుస్థాపన చేసి నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తయ్యేలా చూస్తామని తెలిపారు. నిధులు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డికు కృతజ్ఞతలు తెలిపారు.

జహీరాబాద్‌: జహీరాబాద్‌ ఐసీడీఎస్‌ కేంద్రం పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులతో పాటు ఆయాలుగా పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సీడీపీఓ సుశీల తెలిపారు. ప్రాజెక్టు పరిధిలో గల అన్ని ప్రాంతాల్లోని 15 అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు, గిరిజన ప్రాంతాల్లో గల 20 ఆయాల పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రజావాణి, కార్యాలయంలో సమర్పించిన దరఖాస్తులు పరిగణలోకి తీసుకోమన్నారు.

మా భూములు మాకే ఇవ్వాలి...

తోటపల్లి రిజర్వాయర్‌ నిర్మాణం వల్ల మా ప్రాంత రైతులకు మేలు జరుగుతుందని భూము లు ఇచ్చాం. రిజర్వాయర్‌ రద్దయింది కాబట్టి మా భూములు మాకివ్వాలని కొన్నేళ్లుగా తిరుగుతున్నాం. భూమి మా పేరు మీద లేకపోవడంతో ప్రభుత్వం నుంచి రావాల్సిన లబ్ధికి దూరమవుతున్నాం. ఇప్పటికై నా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు స్పందించి మా భూములు మాకు ఇవ్వాలి.

–బీనవేణి లక్ష్మణ్‌, రాంచంద్రపూర్‌, రైతు

రెండెకరాలు తీసుకున్నారు

రిజర్వాయర్‌ నిర్మాణం కోసం మాకున్న రెండెకరాలు తీసుకున్నారు. అప్పుడు నామమాత్రంగా పరిహారం ఇచ్చారు. మా భూముల్లో రిజర్వాయర్‌ నిర్మాణం కాలేదు. కాబట్టి మా భూములు మాకివ్వాలి. పెద్ద కంపెనీలకు అయితే భూమి తిరిగి ఇచ్చారు. మాకు ఎందుకు ఇవ్వరు?

–బద్దం శ్రీనివాస్‌ రెడ్డి, రైతు, గాగిల్లాపూర్‌

ప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో 2007లో శంకుస్థాపన చేసిన ఈ రిజర్వాయర్‌కోసం దాదాపు 510 మంది రైతుల దగ్గర నుంచి 1,603 ఎకరాల వ్యవసాయ భూమిని అధికారులు సేకరించారు. అక్కన్నపేట మండలంలో గౌరవెల్లిలో నిర్మించాలనుకున్న రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని 1.04 టీఎంసీల నుంచి 8.23 టీంఎంసీలకు పెంచి తోటపల్లి రిజర్వాయర్‌ను 2015లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రద్దు చేసింది.

1,603 ఎకరాల భూమి సేకరణ

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లిలో 0.950 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ను నిర్మించి దాదాపు 49వేల ఎకరాలకు సాగు నీరందించాలని డిజైన్‌ చేశారు. ఈ రిజర్వాయర్‌ కోసం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్‌, తోటపల్లి, కోహెడ మండలంలోని రాంచంద్రాపూర్‌, వరికోలు, కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలంలోని ఓబులాపూర్‌, నారాయణపూర్‌ గ్రామాల నుంచి 1,603 ఎకరాల భూమిని సేకరించారు. గ్రామాలు ముంపునకు గురవుతుండటంతో ఈ రిజర్వాయర్‌పై ఇంజనీరింగ్‌ అధికారులతో అధ్యయనం చేయించింది. తోటపల్లి రిజర్వాయర్‌ 0.3 టీంఎంసీల నీటినిల్వ సామర్థ్యం ఉండేందుకు అవకాశముందని అధికారులు ప్రభుత్వానికి నివేదికను అందించారు. తక్కువ సామర్థ్యం ఉండటంతో బెజ్జంకి, కోహెడ, చిగురుమామిడి మండలాల్లోని గ్రామాలు ముంపునకు గురికాకుండా గాగిల్లాపూర్‌ మోయతుమ్మెద వాగుపై గ్రావిటీ కెనాల్‌ నిర్మించి అక్కన్నపేటలోని గౌరవెల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలించేందుకు ప్రణాళికను రూపొందించింది. తోటపల్లి రిజర్వాయర్‌ను మార్చి తోటపల్లి చెరువును బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా మార్చుకోవాలని నిర్ణయించింది. దీంతో తోటపల్లి రిజర్వాయర్‌ను అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే తోటపల్లి రిజర్వాయర్‌ నిర్మాణం కోసం సేకరించిన భూములు ఇప్పటికీ ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి. ఈ భూములను సదరు రైతులు సాగు చేస్తున్నప్పటికీ రికార్డుల్లో వారి పేరిట భూములు లేకపోవడంతో వారికి రైతు భరోసా, రైతు బీమా వర్తించడం లేదు. బ్యాంక్‌ రుణాలకు సైతం దూరమవుతున్నారు.

100 ఎకరాల్లో గ్రావిటీ కెనాల్స్‌..

తోటపల్లి రిజర్వాయర్‌ కోసం 1,603 ఎకరాల భూమిని సేకరించగా అందులో 100 ఎకరాలు గ్రావిటీ కెనాల్స్‌ నిర్మాణం కోసం వినియోగించాలని, మిగతా 1,503 ఎకరాల భూమిని రైతులకు తిరిగి ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతులకు ఎకరానికి రూ.2.10లక్షలు పరిహారం ఇవ్వగా ప్రభుత్వం మార్కెట్‌ ధర ఇచ్చి భూములు తిరిగి తీసుకోవాలని అప్పటి కరీంనగర్‌ కలెక్టర్‌ నీతూ ప్రసాద్‌ ప్రకటించారు. అయితే అప్పుడు నామమాత్రపు పరిహారం తీసుకున్న రైతులు మార్కెట్‌ ధర ఎక్కువగా ఉండటంతో చాలామంది రైతులు ముందుకు రాలేదు. అనంతరం జిల్లాల విభజన జరగడంతో బెజ్జంకి, కోహెడ మండలాలు సిద్దిపేట జిల్లాలోకి రాగా, చిగురుమామిడి మండలం కరీంనగర్‌ జిల్లాలోనే కొనసాగుతుంది. ఓ ప్రైవేట్‌ సీడ్‌ కంపెనీకి చెందిన 124 ఎకరాల భూమిని సేకరించగా దానిని 2021లో తిరిగి ఇచ్చారు. తమ భూములు తమకు ఇవ్వాలని పలువురు రైతులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ స్పష్టత ఇవ్వలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement