ప్రసిద్ధమైన వర్గల్ శ్రీవిద్యాధరి, నాచగిరి శ్రీలక్ష్మీనృసింహక్షేత్రాలు ఆదివారం భక్తులతో కిటకిటలాడాయి. సరస్వతిమాత సన్నిధానం చిన్నారుల అక్షరాభ్యాసాలతో శోభిల్లింది. తమ తల్లిదండ్రుల సమక్షంలో 650 మంది చిన్నారులు అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య అక్షరాలు దిద్దారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. మరోవైపు నాచగిరి క్షేత్రాన్ని పెద్దసంఖ్యలో భక్తులు సందర్శించారు. హరిద్రలో పుణ్యస్నానాలాచరించి అభిషేకాలు, కల్యాణాలు, వ్రతాది మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారిని దర్శించుకుని తరించారు. సరస్వతి క్షేత్రాన్ని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ వేదపండితులు మహదాశీర్వచనం చేసి, శేషవస్త్రం అందజేశారు. –వర్గల్(గజ్వేల్)


