వాన కురిసె.. మడి మురిసె | - | Sakshi
Sakshi News home page

వాన కురిసె.. మడి మురిసె

Jul 5 2026 7:26 AM | Updated on Jul 5 2026 7:26 AM

జిల్లాలో సగటున 32 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు ఇప్పటికి 82,356 ఎకరాల్లో మాత్రమే సాగు

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): జిల్లాలో రెండు రోజులుగా వర్షం కురుస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం సాగులో భాగంగా ఇప్పటివరకు వర్షం కోసం దిగాలుగా చూసిన రైతులు వర్షం రాకతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం, శనివారాల్లో కురిసిన వర్షంతో రైతులకు ఊరట లభించినట్లైంది. ఈ వానాకాలం సాగు నుంచి రైతుతో దోబుచులాడుతున్న వర్షం రెండు రోజులుగా కురుస్తుండటంతో రైతులు తమ పనుల్లో నిమగ్నమైపోయారు. పత్తి, మొక్కజొన్న, కందులు, తదితర ఆరుతడి పంటలకు ఈ వర్షం ఉపయోగపడుతుంది. జిల్లాలో ఇప్పటివరకు 3,85,338 ఎకరాలకుగాను 2,130 ఎకరాల్లో వరి, 1,18,772 ఎకరాల పత్తికి గాను 70,402 ఎకరాల్లో, 28,027 ఎకరాలకు గాను 8,421 ఎకరాల్లో మొక్కజొన్న, 7,431 ఎకరాలకు గాను 1,312 ఎకరాల్లో కందులు, 14 ఎకరాల్లో పెసర్లకు గాను 36 ఎకరాల్లో, ఇతర ఉద్యానపంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో మొత్తంగా 5,41,550 ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

ప్రతి ఏటా వర్షంతో పరేషాన్‌

ప్రతీ సంవత్సరం వానాకాల పంటలు ప్రారంభం కాగానే వర్షాలు ముఖం చాటేస్తున్నాయి. దీంతో రైతులు దిగాలు పడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. విత్తనాలు విత్తాక వరుణుడు మాత్రం కరుణించడం లేదు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల ఇప్పటివరకు జిల్లాలో 5,41,550 ఎకరాలకుగాను 82,356 ఎకరాలు మాత్రమే సాగైంది.

శుక్ర, శనివారాల్లో జిల్లా వ్యాప్తంగా వర్షాలు

ఈ వానాకాలంలో వర్షాల సాగుకు అనుగుణంగా వర్షాలు కురవడం లేదు. శుక్రవారం, శనివారాలు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. శుక్రవారం జిల్లా సగటున 10.46మిల్లిమీటర్లు, శనివారం జిల్లా సగటున 32 మిల్లిమీటర్లు వర్షపాతం నమోదైంది. దీంతోపాటుగా మరో మూడు రోజుల పాటుగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, అధికారులు తెలుపుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు

కొండపాకలో అత్యధికంగా

54 మిల్లిమీటర్ల వర్షపాతం

శనివారం జిల్లాలో కొండపాక మండలంలో 54 మిల్లిమీటర్లు, మద్దూరు మండలంలో 50, దుబ్బాక మండలంలో 49, సిద్దిపేట రూరల్‌ మండలంలో 48, మిరుదొడ్డి మండలంలో 47, అక్బర్‌పేట–భూంపల్లి మండలంలో 45 , దౌల్తాబాద్‌ మండలంలో 41, తొగుట మండలంలో 41, చేర్యాల మండలంలో 40, నారాయణరావుపేట మండలంలో 36, ధూళ్మిట్ట మండలంలో 35, కొమురవెల్లి మండలంలో 34, సిద్దిపేట అర్బన్‌ మండలంలో 34, కుకునూరు మండలంలో 32, చిన్నకోడూరు మండలంలో 30 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement