శుక్రవారం, శనివారం కురిసిన వర్షాలు రైతులకు లబ్ధి చేకుర్చుతాయి. ఈ వానాకాలం నుంచి వర్షాలు సక్రమంగా కురవడం లేదు. ఈ రెండు రోజులు కురిసిన వర్షాలతో సాగుకు సిద్ధమవుతున్నాం. ఇప్పటికే వానాకాలం ప్రారంభమై నెల రోజులైంది.
తిరుపతిరెడ్డి, మెట్‌పల్లి, చిన్నకోడూరు మండలం
భయాందోళనలు నెలకొన్నాయి
ఈ వానాకాలం నుంచి సక్రమంగా వర్షాలు కురవ లేదు. దీంతో దుక్కిలు దున్ని విత్తనాలు విత్తడం కోసం ఎదురు చూశాం. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు సాగుకు అనుకూలంగా మారాయి. వరుణుడు సరైన సమయంలో అన్నదాతలకు అండగా నిలిచాడు. దీంతో ఇప్పుడు మేమందరం తిరిగి వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యాం. దండ్యాల వెంకట్‌రెడ్డి, ఐనాపూర్, కొమురవెల్లి మండలం


