జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్
సిద్దిపేటకమాన్: చెక్ బౌన్స్ కేసులకు సంబంధించి ఈ నెల 18న జరగనున్న స్పెషల్ జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కోర్టు భవనంలో జిల్లా న్యాయవాదులతో ప్రధాన న్యాయమూర్తి శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లాలో మొత్తం 1,324 చెక్ బౌన్స్ (ఎన్‌ఐ యాక్టు) కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. స్పెషల్ లోక్ అదాలత్‌లో అధిక మొత్తంలో కేసులు రాజీపడేట్లు చూడాలని న్యాయవాదుల కు సూచించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు కుమారస్వామి, తరణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్‌బాబు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
చేర్యాల కోర్టును సందర్శించిన జిల్లా జడ్జి
చేర్యాల(సిద్దిపేట): చేర్యాల కోర్టును జిల్లా జడ్జి సుదర్శన్ శనివారం సందర్శించారు. ఈసందర్భంగా కోర్టు పరిసరాలను పరిశీలించి న్యాయవాదులతో కలసి మొక్కను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాత కేసులు త్వరగా పరిష్కరించాలని చేర్యాల కోర్టు జడ్జి బానోత్ శ్రీరామ్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆరే వీరమల్లయ్య, ప్రధాన కార్యదర్శి మెరుగు రమేష్, ఆరే మహేందర్, జిల్లా న్యాయవాదులు, పోలీసు,కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
సన్నరకం వడ్లను యాప్‌లో నమోదు చేయాలి
గజ్వేల్ ఏడీఏ బాబునాయక్
గజ్వేల్: ప్రభుత్వం సూచించిన విధంగా ఏడు సన్న రకాల వడ్లను సాగుచేసిన రైతుల వివరాలను టీ–అగ్రిసీడ్ యాప్‌లో నమోదు చేయాలని గజ్వేల్ ఏడీఏ బాబునాయక్ సూచించారు. శనివారం గజ్వేల్‌లోని రైతు వేదికలో స్థానిక వ్యవసాయాధికారి నాగరాజుతో కలిసి టీ–అగ్రిసీడ్ యాప్‌పై విత్తన డీలర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రైతువారీగా ఏడు రకాల సన్నరకం విత్తన అమ్మకం వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. దీని ద్వారానే కొనుగోళ్ల సమయంలో అందుబాటులో కచ్చితమైన సమాచారం ఉంటుందని చెప్పారు. ఇంకా ఈ సదస్సులో కొండపాక, కుకునూర్‌పల్లి, రాయపోల్ వ్యవసాయాధికారులు శివరామకృష్ణ, గోవిందరాజులు, నరేష్, ఏఈఓలు సచిన్, రమ, గణేష్‌లతోపాటు విత్తన డీలర్లు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
తపస్ జిల్లా అధ్యక్షుడు మురళీధర్
తొగుట(దుబ్బాక): ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని తెలంగాణ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు చిలుముల మురళీధర్ హెచ్చరించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ... ఉపాధ్యాయులకు 51% పీఆర్సీని వెంటనే ప్రకటించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో ప్రకటించినట్లుగా సీపీఎస్‌ను రద్దుచేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖలో 190జీవోను అమలు పరచాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల హెల్త్‌కార్డుల విషయంలో పారదర్శకత పాటించాలని కోరారు. ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల అధ్యక్ష కార్యదర్శులు రవీందర్‌రెడ్డి, రాజేశం, నాయకులు భగవాన్, శ్రీనివాస్, మల్లేశం, కనకయ్య, నర్సింహరెడ్డి, లక్ష్మణ్ పాల్గొన్నారు.


