8లో
సుశిక్షితులైన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన, పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పనతో సర్కారు బడి మొత్తంగా నిలబడింది. కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ల నిలువెత్తు దోపిడీలను తప్పించుకుంటూ చాలామంది ప్రభుత్వ బడివైపు అడుగులేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు సైతం తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పిస్తూ మిగిలిన వారికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సర్కారు బడుల బలోపేతంపై దృష్టి సారిస్తూ, ప్రభుత్వ విద్యకు పెద్ద పీట వేస్తున్న వారిపై ఈ వారం సండే స్పెషల్.
భక్తులతో నాచగిరి క్షేత్రం
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధ నాచగిరి శ్రీలక్ష్మీనృసింహ క్షేత్రం శనివారం సత్యదేవుని వ్రతాలతో అలరారింది. తమ ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. హల్దీనది వాగులో, ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలాచరించారు. దంపతులు శ్రీవారి సన్నిధిలో భక్తిశ్రద్ధలతో సత్యనారాయణస్వామి వ్రతమాచరించారు. భక్తులు గర్భగుడిలో విశేషాలంకృతులైన శ్రీలక్ష్మీనారసింహులను దర్శించుకుని తరించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయసిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు.


