కోర్టును తరలించవద్దు | - | Sakshi
Sakshi News home page

కోర్టును తరలించవద్దు

Jul 5 2026 7:26 AM | Updated on Jul 5 2026 7:26 AM

హుస్నాబాద్‌లో వెలిసిన ఫ్లెక్సీలు

హుస్నాబాద్‌లో వెలిసిన ఫ్లెక్సీలు

హుస్నాబాద్‌: హుస్నాబాద్‌ కోర్టును జిల్లెల్లగడ్డ శివారుకు తరలించవద్దని పట్టణంలో ఫ్లెక్సీలు వెలిశాయి. మండలంలోని జిల్లెల్లగడ్డ శివారులో కొత్తగా కోర్టు భవనాల సముదాయ నిర్మాణం కోసం సర్వే నంబర్‌ 265లో 5.20 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఇటీవల జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రెవెన్యూ అధికారులతో కలిసి జడ్జి రేవతి కేటాయించిన స్థలాన్ని శనివారం పరిశీలించారు. ఈ స్థలాన్ని జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు భవన నిర్మాణానికి కేటాయించినట్లుగా బోర్డును ఏర్పాటు చేశారు. కోర్టును తరలిస్తే హుస్నాబాద్‌, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాల పేద ప్రజలకు ఇబ్బందిగా ఉంటుందని, ప్రస్తుత హుస్నాబాద్‌ కోర్టు పరిధిలో 1.32 ఎకరాల భూమి ఖాళీగా ఉందని, దానిలోనే సబ్‌ కోర్టు నిర్మాణం చేయాలని కోరుతున్నట్లు ఫ్లెక్సీల్లో రాశారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ చొరవ తీసుకుని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement