మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్‌పల్లి, సంగాపూర్ గ్రామాల పరిధిలో నిర్మిస్తున్న ఆర్‌అడ్‌ఆర్ కాలనీ నిర్మించిన సంగతి తెల్సిందే. ఆయా గ్రామాల పరిధిలో 600 ఎకరాలకుపైగా భూమిని సేకరించి నిర్వాసిత గ్రామాలకు చెందిన సుమారు 2,500 ఇళ్లతోపాటు మరో 3వేలమందికి ఓపెన్ ప్లాట్లను అందజేశారు. ఇక్కడ సేకరించిన భూమిలో సుమారు 18వేల గుంటలు ఇళ్ల స్థలాలకు కేటాయించారు. ఇందులో 10 నుంచి 12వేల గుంటల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టి, మిగతా భూమిని రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఫంక్షన్‌హాల్, షాపింగ్‌కాంప్లెక్స్, పార్కు, దేవాలయాలు ఇతర అవసరాల కోసం వినియోగిస్తున్నారు. ఇండ్ల నిర్మాణాల కోసం రూ.250 కోట్లు, ఇతర వసతుల కల్పన కోసం మరో రూ. వంద కోట్లకుపైగా వెచ్చించారు. ప్రధాన రోడ్లు 80, 60ఫీట్లతో అంతర్గత రోడ్లు 40 ఫీట్ల వెడల్పుతో ఏర్పాటు చేశారు.
లే అవుట్ అనుమతులేవీ?
డీటీసీపీ(డైరెక్టరేట్ ఆఫ్ కంట్రీ ప్లానింగ్) తరహాలో రూపుదిద్దుకున్న ఈ కాలనీ లే–అవుట్‌కు డీటీసీపీ నుంచి కలెక్టర్ నుంచి అప్రూవుడ్ లే–అవుట్‌గా అనుమతులు లేవు. అనుమతి తీసుకోవాలన్న విషయాన్ని కూడా అధికారులు మరిచిపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకవేళ ఉన్నా.. అధికారికంగా ధ్రువీకరించే ఫైలును అధికారులు బయటపెట్టడం లేదు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం కోసం సర్వం ధారపోసిన నిర్వాసితులపై ఇలా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటంతో నిరసన వెల్లువెత్తుతోంది.
చార్జీలు తడిసి మోపెడు..
ఈ కాలనీలో కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలంటే అనుమతి లేని కారణంగా ముందుగా ఎల్‌ఆర్‌ఎస్ ఆ తర్వాత బిల్డింగ్ పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. సుమారుగా 200గజాల్లో ఇల్లు నిర్మించుకోవాలంటే లే–అవుట్ అనుమతి ఉంటే.. సుమారుగా రూ.80వేలవరకు చార్జీ చెల్లించాల్సి వచ్చేది. ఎల్‌ఆర్‌ఎస్ కూడా తప్పనిసరిగా మారటంతో సుమారు రూ.2లక్షలు చెల్లించాల్సి వస్తోందని చెబుతున్నారు. ఈ చార్జీలు ఏరియా బట్టి మారనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పలువురు బిల్డింగ్ పర్మిషన్, ఎల్‌ఆర్‌ఎస్ లేకుండా కాలనీలో ఇళ్ల నిర్మాణం చేపడుతుండగా...మున్సిపల్ అధికారులు కూల్చేయడం తరుచూ ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి. ఈ వ్యవహారంపై కొన్ని రోజుల కిందట బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య గొడవకు దారితీసిన సంగతి తెల్సిందే. ఈ పరిస్థితుల్లో అధికారులు ఈ అంశంపై ఎలాంటి పరిష్కారం చూపుతారనే అంశంపై నిర్వాసితులు ఎదురుచూస్తున్నారు.
ఇల్లు కట్టాలంటే.. ఎల్‌ఆర్‌ఎస్ తప్పనిసరి
ఆర్‌అండ్‌ఆర్ కాలనీ లే–అవుట్‌కు అనుమతుల్లేకే కష్టాలు
పర్మిషన్ పేరిట మున్సిపల్ అధికారుల కూల్చివేతలు
కాలనీలో తరచూ ఉద్రిక్తతలు
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో దుస్థితి
మల్లన్నసాగర్ నిర్వాసితులకు మరో కష్టం వచ్చిపడింది. గతంలో ఈ కాలనీ లే–అవుట్ చేసిన అధికారులు అనుమతుల విషయాన్ని మరిచిపోవడం నేడు సమస్యలను సృష్టిస్తోంది. కొత్తగా ఈ కాలనీలో ఇల్లు నిర్మించుకోవాలంటే బిల్డింగ్ పర్మిషన్‌తోపాటు ఎల్‌అర్‌ఎస్ (లే–అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) చేయించుకోవడం అనివార్యంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో చార్జీల భారం మోయలేమని నిర్వాసితులు చెబుతున్నారు. కొందరు ఎలాంటి అనుమతులు లేకుండా ఇళ్లు నిర్మించుకోవడం, ఇదే క్రమంలో మున్సిపల్ అధికారులు కూల్చేయడం.. ఉద్రిక్తతలకు దారితీస్తోంది. – గజ్వేల్


