చేర్యాల(సిద్దిపేట): టెన్త్, ఇంటర్మీడియెట్ చదివేందుకు సార్వత్రిక దూర విద్యలో ప్రవేశాలు ప్రారంభమైనట్లు పెద్దమ్మగడ్డ జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం సురేష్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 14 ఏళ్ల వయస్సు నిండి మధ్యలో చదువు మానేసిన యువతీయువకులకు ఇది గొప్ప అవకాశమన్నారు. ఈ సార్వత్రిక దూర విద్యా విధానంలో 10వ తరగతి, లేదా ఇంటర్మీడియెట్ సింగిల్ సిట్టింగ్ ద్వారా ఒకే విద్యా సంవత్సరంలో పూర్తి చేసుకోవచ్చన్నారు. సర్టిఫికెట్ రెగ్యులర్ విద్యలో సంపాధించిన సర్టిఫికెట్‌కు సమానమ ని తెలిపారు. ప్రవేశాలకు ఈ నెల 28 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా అడ్మిషన్ పొందవచ్చని తెలిపారు. మరింత సమాచారం కోసం 9949106117, 9666274952 నంబర్లను సంప్రదించాలన్నారు.
గజ్వేల్‌రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థినులు డిజిటల్ టెర్నింగ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కళాశాల ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ అనిత అబ్రహం పేర్కొన్నారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ తమ కళాశాలకు చెందిన 215 మంది విద్యార్థినులు మొత్తం 54 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 30 రోజుల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ కళాశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్న–అక్క మెంటార్ షిప్ ఏఐ డిజిటల్ తరగతుల కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు కృత్రిమ మేథస్సు(ఏఐ), డిజిటల్ అక్షరాస్యత, కంప్యూటర్ ప్రాథమికాలు, ఇంటర్నెట్ వినియోగం, సైబర్ భద్రత, సోషల్ మీడియా వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారన్నారు.
సిద్దిపేటజోన్: జిల్లా వ్యవసాయశాఖ అధికారి స్వరూపరాణి శుక్రవారం సిద్దిపేట మండల పరిధిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండలంలోని ఫర్టిలైజర్స్ షాప్స్ తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. యూరియా యాప్ ద్వారా పంపిణీ ప్రక్రియ, స్టాక్ వివరాలు, తదితర అంశాలపై అరా తీశారు. మండలంలో ఇప్పటివరకు 8,169 యూరియా బస్తాలు పంపిణీ చేసినట్లు అధికారులు వివరించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా యాప్ ద్వారా పంపిణీ చేయాలని సూచించారు. ఆమె వెంట మండల వ్యవసాయశాఖ అధికారి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేటజోన్: ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలని ట్రైనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భవ్యశ్రీ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని 25వార్డులో 116పోలింగ్ కేంద్రం పరిధిలో సర్ ప్రక్రియ పరిశీలించారు. ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ, వివరాల నమోదు, పత్రాల సేకరణ తదితర అంశాలపై అరా తీశారు. ప్రజల సహకారం గూర్చి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఎల్లారెడ్డి, బూత్ లెవల్ ఆఫీసర్ శ్రీలత, వార్డు ప్రతినిధి బాలకిషన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
వైద్య విద్యార్థుల ర్యాలీ
గజ్వేల్: ములుగు మండలం లక్ష్మక్కపల్లిలోని ఆర్‌వీఎం మెడికల్ కళాశాల విద్యార్థులు శుక్రవారం గజ్వేల్ పట్టణంలోని ప్రధాన రహదారిపై ‘రైతు భద్రతా’ ర్యాలీ నిర్వహించారు. ‘పురుగు మందులు... పురుగులకు చేటు కలిగించాలి’...మనుషుల కు కాదు’ అంటూ ఫ్లెక్సీ ప్రదర్శించి ర్యాలీని నిర్వహించారు. పంటలు పండలేదనే ఆవేదనతో రైతులు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాలని ఆకాంక్షించారు. రైతులు మనోధైర్యంతో ముందుకుసాగాలని నినదించారు. కార్యక్రమంలో ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ చందన, కళాశాల డీన్, వైద్యులు, సిబ్బంది, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.


