జిల్లా వ్యాప్తంగా శుక్రవారం వర్షాలు కురిశాయి. సగటున 10.46మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కొమురవెల్లి 30మిల్లీమీటర్లు, తొగుటలో 28మి.మీ., కొండపాకలో 24మి.మీ., మద్దూరులో 22మి.మీ., దౌల్తాబాద్, మిరుదొడ్డిలలో 20మి.మీ. వర్షపాతం నమోదయ్యింది. విస్తారంగా వర్షాలు కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దుక్కిలను సిద్ధం చేసుకున్న రైతన్నలకు శుక్రవారం కురిసిన వర్షం గొప్ప ఊరటనిచ్చింది. – ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)
జిల్లా కేంద్రంలోని మోడల్ రైతు బజార్ అన్నదాతల దుస్థితి ఇది. కొంత కాలంగా రైతు బజార్ క్లీనింగ్ పేరిట అధికారులు ప్రతి శుక్రవారం సెలవు ప్రకటిస్తున్నారు. దీంతో వందలాది మంది రైతులు ఆరుబయటే రోడ్డు పక్కన కూరగాయలు, ఆకు కూరలు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం వేళ ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. చేసేదిలేక ఇలా తడుస్తూనే విక్రయాలు సాగించారు.
– సిద్దిపేటజోన్
● జిల్లా వ్యాప్తంగా వానలు
● కొమురవెల్లిలో 30 మి.మీ. వర్షపాతం నమోదు


