● నాలుగు చోట్ల ప్రక్రియ పూర్తి
● మిగతా సొసైటీల్లో నామినేషన్ల ప్రక్రియ
సిద్దిపేటజోన్: జిల్లాలో చేనేత, ఉన్ని సహకార సంఘాల ఎన్నికల షెడ్యూల్ మేరకు నాలుగు సొసైటీల్లో ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. మొదటి దశలో భాగంగా 50 ఓట్ల లోపు ఉన్న సొసైటీల్లో శుక్రవారం చేతులెత్తి ఓటింగ్ ప్రక్రియ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు. ఈమేరకు ఒకేరోజు నామినేషన్లు, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ ఉండటంతో ఎన్నికల అధికారులు సజావుగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఆదర్శ చేనేత సహకార సంఘానికి గూడూరు శ్రీనివాస్, పోట్లపల్లి సొసైటీకి సబ్బని వెంకటేశం, చెర్ల తోటపల్లి సొసైటీకి గాజుల భగవాన్, గజ్వేల్ ఉన్ని సొసైటీకి పులి బాలచంద్రంలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అనంతరం తొమ్మిది మంది ఆఫీస్ బేరర్స్‌తో కూడిన కార్యవర్గాన్ని ప్రకటించారు.


