మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్
సిద్దిపేటజోన్: ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలని, నిర్దేశించిన గడువులోగా ఎన్యూమరేషన్ పత్రాలు ప్రజల నుంచి సేకరించాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని 4, 22 వార్డుల్లో ఆయన క్షేత్ర స్థాయిలో ఎన్యూమరేషన్ ప్రక్రియ పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి సిబ్బందితో కలిసి పత్రాలు పంపిణీ చేశారు. ప్రజలకు సర్ ఉద్దేశ్యం, ఎన్యూమరేషన్ పత్రాలను నింపే విధానం వివరించారు. ఆయన వెంట వార్డు సూపర్ వెజర్, బూత్ లెవల్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడులు
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూపరాణి
చిన్నకోడూరు(సిద్దిపేట): రైతులు నాణ్యమైన విత్తనాలు వేసుకుంటే అధిక దిగుబడి వస్తుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూపరాణి, జిల్లా కోపరేటివ్ అధికారి వరలక్ష్మి అన్నారు. నాబార్డు సహకారంతో గంగాపూర్ సహకార సంఘంలో విత్తనోత్పత్తిపై రైతులకు అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ విత్తనోత్పత్తి చేయడానికి హుస్నాబాద్, జగదేవ్‌పూర్, గంగాపూర్‌లో మూడు సహకార సంఘాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులకు నాణ్యమైన వరి విత్తనాలు అందించేందుకు మూడు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో 90 శాతం వరి విత్తనాలు ప్రైవేటు సంస్థలవే కొనుగోలు చేస్తుండటంతో పంట దిగుబడి తగ్గుతోందన్నారు. దీనిని నియంత్రించడానికి విత్తనోత్పత్తి చేయాలని సూచించారు. శాస్త్రవేత్తలు సంతోష్ కుమార్, డా. పల్లవి, ఏఈఓ, రైతులు ఉన్నారు.
వైభవంగా బొడ్రాయి ఉత్సవాలు
నేడు హాజరు కానున్న మంత్రి వివేక్
మర్కూక్(గజ్వేల్): మర్కూక్ మండల కేంద్రంలో బొడ్రాయి(నాభిశిల) ఉత్సవాలు రెండో రోజు గురువారం కూడా అంగరంగ వైభవంగా కొనసాగాయి. వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య బొడ్రాయికి జలాభిషేకం చేశారు. హోమాలు, పూజల్లో స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సర్పంచ్ రాణి, ఉప సర్పంచ్ మహేశ్ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం మంత్రి వివేక్, ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నీలం మధు పూజల్లో పాల్గొంటారని మండల నాయకుడు మోర్సు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.


