వైఫల్యాలను ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా? | - | Sakshi
Sakshi News home page

వైఫల్యాలను ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా?

Jul 3 2026 9:38 AM | Updated on Jul 3 2026 9:38 AM

గజ్వేల్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం తప్పిదాలను ప్రజలకు వివరించడానికి ప్రయత్నిస్తున్న ప్రతిపక్షాల గొంతు నొక్కడం సిగ్గుచేటని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానా లపై మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో రూ.4.25కోట్ల అప్పులు చేసి అన్ని రంగాలను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌కు దక్కిందని చెప్పారు. ఈ అప్పులతో రూ. 20లక్షల కోట్ల సంప ద బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సృష్టించిందన్నారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక రూ. 2 లక్షల కోట్ల అప్పులు చేశారని, ఈ అప్పులతో కొత్తగా రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీలేదని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్కడికక్కడా నిలదీస్తుండడం, సంక్షేమ శాఖ లో జరిగిన టెండర్ల అవినీతిని మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రశ్నించడాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం తట్టుకోలేకపోతుందన్నారు. హామీల అమలులో విఫలమై ప్రజల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ రాబోవు రోజుల్లో గుణపాఠం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement