వర్గల్(గజ్వేల్): ప్రసిద్ధ నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రంలో బుధవారం హుండీ కానుకలను లెక్కించా రు. గడచిన 98 రోజులలో వివిధ హుండీల ద్వారా ఆలయానికి రూ.23,09,829 ఆదాయం సమకూరింది. దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్ రంగారావు, ఆలయ చైర్మన్ పల్లెర్ల రవీందర్‌గుప్తా, ఈఓ బెల్లంకొండ రంగాచారి సమక్షంలో సాయంత్రం వరకు లెక్కింపు కొనసాగింది.ఈ లెక్కింపులో ధర్మకర్తలు చందా నాగరాజు, నాయకం శ్రీనివాస్, గాలి కిష్టయ్య, కొత్తపల్లి శ్రీనివాస్,శివకేశవ సేవాసమితి, భ్రమరాంబిక సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.


