వీబీజీ రాంజీ బిల్లు రద్దు చేయాల్సిందే | - | Sakshi
Sakshi News home page

వీబీజీ రాంజీ బిల్లు రద్దు చేయాల్సిందే

Jul 2 2026 6:55 AM | Updated on Jul 2 2026 6:55 AM

చేర్యాల(సిద్దిపేట): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ జీ రాంజీ బిల్లును రద్దుచేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట్‌మావో డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, తెలంగాణ రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఎంపీడీఓకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులకు బడ్జెట్‌లో నిధులు తగ్గించి రాష్ట్ర ప్రభుత్వంపై భారం మోపడాన్ని ఖండిస్తున్నామన్నారు. వెంటనే ఈ బిల్లును తొలగించాలని, లేని పక్షంలో వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సీఐటీయూ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి, చుంచనకోట సర్పంచ్‌ శ్రీనివాస్‌, ప్రజా సంఘాల నాయకులు అరుణ్‌, మల్లేశం, సిద్ధులు, మైసయ్య, రాజు, నర్సింహారెడ్డి, చంద్రం, వెంకటేశం, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement