సర్‌ లక్ష్యాన్ని పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

సర్‌ లక్ష్యాన్ని పూర్తి చేయాలి

Jul 2 2026 6:55 AM | Updated on Jul 2 2026 6:55 AM

ఆర్డీఓ సదానందం

ఆర్డీఓ సదానందం

సిద్దిపేటజోన్‌: సర్‌ ప్రక్రియలో భాగంగా అధికారులు, సిబ్బంది సమన్వయంతో నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసి మంచి పేరు తీసుకురావాలని ఆర్డీఓ సదానందం సూచించారు.కలెక్టర్‌ హైమావతి సూచన మేరకు బుధవారం డిప్యూటీ ట్రైనీ కలెక్టర్‌ భవ్య, మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున్‌, తహసీల్దార్‌ హరికిరణ్‌లతో కలిసి సూపర్‌ వైజర్లు, బూత్‌ లెవల్‌ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట మున్సిపల్‌ పరిధిలోని ఆయా వార్డుల్లో ఈ నెల 2లోపు ఎన్యూమరేషన్‌ పత్రాలను 95% పంపిణీ చేయాలని ఆదేశించారు. సమాచార సేకరణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పూరించిన పత్రాలను బీఎల్‌ఓలకు ఇవ్వాలని లేనిపక్షంలో ఓటర్‌ జాబితా నుంచి పేరు గల్లంతయ్యే అవకాశం ఉందన్నారు. ప్రతీ వార్డులో హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. వలస వెళ్లిన, చనిపోయిన వారి వివరాలను అందజేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement