అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగా ఉండాలి

Jul 2 2026 6:55 AM | Updated on Jul 2 2026 6:55 AM

కమిషనర్‌ మల్లికార్జున్‌

కమిషనర్‌ మల్లికార్జున్‌

సిద్దిపేటజోన్‌: వర్షాకాల నేపథ్యంలో పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, మురికి కాల్వ ల్లో మట్టి, చెత్తచెదారం తొలగించాలని మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున్‌ సూచించారు. బుధవారం పట్టణంలోని 21, 36, 37, 38, 40, 43 వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విధులకు గైర్హాజరైన పారిశుద్ధ్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. వార్డుల్లో చెత్త సేకరణ వాహనాల సమయపాలన, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. తడి పొడి హానికరమైన చెత్తను తప్పనిసరి వేరుచేసి ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ఆయన వెంట శానిటరీ ఇన్‌స్పెపక్టర్‌ మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement