పర్యావరణ పరిరక్షణే లక్ష్యం కావాలి | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణే లక్ష్యం కావాలి

Jul 1 2026 5:08 AM | Updated on Jul 1 2026 5:08 AM

గజ్వేల్‌రూరల్‌: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదామని డీసీఓ వరలక్ష్మి పిలుపునిచ్చారు. కో–ఆపరేటివ్‌ వారోత్సవాలు సందర్భంగా పీఏసీఎస్‌ గజ్వేల్‌శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మండల పరిధిలోని కొడకండ్లలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెట్లు నరకడం వల్ల పర్యావరణంలో మార్పులు సంభవించి వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ప్రజలు విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ లక్ష్మి, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌లు రఘోత్తంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, గౌత్‌, పీఏసీఎస్‌ కార్యదర్శి బాలయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement