ఏడాదిన్నరగా జమకాని రాయితీ జిల్లా వ్యాప్తంగా 1.79 లక్షల మంది లబ్ధిదారులు పేదలపై తప్పని ఆర్థిక భారం
రూ.500 గ్యాస్ బండ ఉత్తిదేనా?
గ్యాస్ సిలిండర్ రాయితీ విడుదలలో
తీవ్ర జాప్యం నెలకొంది. ఏడాదిన్నరగా సబ్సిడీ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో
జమ కావడం లేదు. మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500 గ్యాస్ సిలిండర్‌ను
అందజేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. తొలుత అమలు చేసినప్పటికీ తరువాత మొండి చెయ్యి చూపింది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.1,012.50.
పేదలపై ఈ మొత్తం భారం పడుతోంది. రాయితీ జమకాకపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సబ్సిడీ డబ్బులు వస్తాయా? రావా? అని లబ్ధిదారులు
ఆందోళన చెందుతున్నారు.
– సాక్షి, సిద్దిపేట
ప్రజాపాలనలో రేషన్ కార్డులున్న వారికి రూ.500లకు గ్యాస్ సిలిండర్ అందించేందుకు దరఖాస్తులు స్వీకరించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీని అందించడం ప్రారంభించారు. 1,79,883 మంది వినియోగదారులకు 10,97,205 గ్యాస్ సిలిండర్లను రూ. 34.74కోట్ల సబ్సిడీని అందించారు. ప్రస్తుతం గృహ వినియోగదారుల సిలిండర్ ధర రూ. 1,012.50 ఉండగా కేంద్రం రూ.47 మాత్రమే జమ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.465.50అందజేయాల్సి ఉంది. పథకం ప్రారంభంలో ఈ రాయితీని సక్రమంగానే జమ చేయగా ఏడాదిన్నర నుంచి ఖాతాల్లో పడటం లేదని లబ్ధిదారులు గ్యాస్ ఏజెన్సీలు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మహాలక్ష్మి లబ్ధిదారులకు దాదాపు రూ.50 కోట్ల వరకు రాయితీ బకాయి ఉన్నట్లు తెలుస్తోంది.
పేదలపై భారం
రాష్ట్ర ప్రభుత్వం రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని ప్రకటన చేయడంతో సంతోషించారు. కొన్ని నెలలు సబ్సిడీ చెల్లించారు. ఏడాదిన్నరగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీని ఇవ్వకపోవడంతో పేదలపై ఆర్థిక భారం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రాయితీ చెల్లిస్తే ఆ డబ్బులు వంట నూనైకె నా ఉపయోగపడేవి అని లబ్ధిదారులు అంటున్నారు. మొత్తం చేతి డబ్బులే వెచ్చించాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. ఒక్కొక్కసారి డబ్బులు లేక అప్పు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


