సిబ్బంది సేవలు మరువలేనివి | - | Sakshi
Sakshi News home page

సిబ్బంది సేవలు మరువలేనివి

Jul 1 2026 5:08 AM | Updated on Jul 1 2026 5:08 AM

సీపీ రష్మీ పెరుమాళ్‌

సిద్దిపేటకమాన్‌: పోలీస్‌ శాఖలో సుదీర్ఘకాలం విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన పోలీసు సిబ్బంది సేవలు మరువలేమని సీపీ రష్మీ పెరుమాళ్‌ తెలిపారు. పదవీ విరమణ పొందిన సూపరింటెండెంట్‌ కార్యాలయం వెంకటేశ్వరరావు, ఏఎస్‌ఐలు రామ్ముర్తి, నవీన్‌కుమార్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ పెంటయ్యలను సీపీ మంగళవారం మెమెంటో అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలు పొందారని తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్‌ కుశాల్కర్‌, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

న్యాయమూర్తి

బాలసదనం సందర్శన

సిద్దిపేటజోన్‌: జిల్లా కేంద్రంలోని బాలసదనాన్ని మంగళవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్‌ ఆదేశాల మేరకు ప్రిన్సిపాల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి సంతోష్‌ కుమార్‌ సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లల యోగక్షేమాలు గూర్చి అరా తీశారు. పిల్లలకు చట్టాలు, విద్య ప్రాముఖ్యత గురించి వివరించారు. ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు ఉన్నా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీని సంప్రదించాలని సూచించారు. సిబ్బంది హాజరు పట్టిక పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు అందిస్తున్న భోజనం నాణ్యత, వంటగది పరిసరాలను, నిల్వ ఉన్న ఆహార పదార్థాలను పరిశీలించారు.

అధిక ధరలకు

విక్రయిస్తే చర్యలు

తూనికలు కొలతల జిల్లా అధికారి శివరంజని

సిద్దిపేటకమాన్‌: నోట్‌బుక్స్‌, ఇతర పుస్తకాలు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా తూనికల అధికారి శివరంజని తెలిపారు. సిద్దిపేట పట్టణంలో బుక్‌ డిపోలను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణంలోని ఓ బుక్‌ డిపోలో పుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు అందటంతో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. బుక్‌ డిపోలో నిర్ణయించిన ధరకు ఉండాల్సిన పేజీల కంటే తక్కువ ఉండటంతో కేసు నమోదు చేసి, జరిమానా విధించినట్లు తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా బుక్‌ డిపోలను నిర్వహించాలని ఆమె సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement