94,854 మంది చిన్నారులకు చుక్కల మందు | - | Sakshi
Sakshi News home page

94,854 మంది చిన్నారులకు చుక్కల మందు

Jun 30 2026 4:44 PM | Updated on Jun 30 2026 4:44 PM

● డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ధనరాజ్‌ ● ఇంటింటికి తిరిగి చుక్కల మందు వేసిన వైద్య సిబ్బంది

● డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ధనరాజ్‌ ● ఇంటింటికి తిరిగి చుక్కల మందు వేసిన వైద్య సిబ్బంది

సిద్దిపేటకమాన్‌: జిల్లాలో వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ధనరాజ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలు 94,321 మందిని గుర్తించగా రెండు రోజుల్లో మొత్తం 94,854మందికి పోలియో చుక్కలు వేశామన్నారు. ఇతర ప్రాంతాల పిల్లలు కూడా ఇక్కడ వేయించుకోవడంతో జిల్లాలో 100.56శాతం నమోదైనట్లు తెలిపారు. మంగళ వారం వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి 3,649మంది చిన్నారులకు చుక్కలు వేశారన్నారు. ట్రాన్సిస్ట్‌ పాయింట్ల వద్ద 426మంది, మొబైల్‌ టీంల ద్వారా 208మంది, రోడ్లపైన, రహదారి మార్గంలో సూపర్‌వైజర్ల ద్వారా 54మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు పేర్కొన్నారు. మంగళవారం కూడా వైద్య సిబ్బంది మిగిలిన చిన్నారులకు ఇంటింటికి తిరిగి చుక్కలు వేయనున్నట్లు పేర్కోన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ దీప్తిప్రియాంక, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు డాక్టర్‌ వినోద్‌బాబ్జి, డాక్టర్‌ శ్రీకాంత్‌యాదవ్‌, డాక్టర్‌ నిర్మలారెడ్డి, డాక్టర్‌ మీనా, ఏఎన్‌ఎంలు, ఆశాకార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

పల్స్‌పోలియోపై స్టేట్‌ టీమ్‌ పరిశీలన

వర్గల్‌(గజ్వేల్‌): వర్గల్‌ మండలంలోని హైరిస్క్‌ ప్రాంతాల్లో పల్స్‌పోలియో తీరును సోమవారం రాష్ట్ర కార్యక్రమ అధికారి డాక్టర్‌ జ్యోత్స్న ఆధ్వర్యంలోని బృందం తనిఖీచేసింది. నగరం తండా, శ్రావ్య, స్నేహా ఫారాలు, అరుణ గార్డెన్స్‌ యోగా ఫారాలను సందర్శించి అక్కడి లేబర్‌ను పోలియో చుక్కలపై ఆరాతీశారు. జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ దీప్తి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శ్రీనివాస్‌, మెడికల్‌ ఆఫీసర్‌ మీనాకుమారి, పీహెచ్‌సీ సిబ్బంది వారి వెంట ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement