వ్యవసాయ రుణ ప్రణాళిక రూ.7,542 కోట్లు | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ రుణ ప్రణాళిక రూ.7,542 కోట్లు

Jun 29 2026 7:15 AM | Updated on Jun 29 2026 7:15 AM

పిడుగుల కాలం జాగ్రత్త! పిడుగుపాటుకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వివరాలు 8లో u పారిశుద్ధ్యం.. సిద్దిపేట పట్టణంలో పారిశుద్ధ్యం లోపించింది. అధికారుల పర్యవేక్షణ కరువైంది. వివరాలు 9లో u సోమవారం శ్రీ 29 శ్రీ జూన్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

గతేడాదితో పోలిస్తే రూ.800 కోట్లకు పైగా అదనం సకాలంలో అందితేనే రైతులకు ప్రయోజనం

పిడుగుల కాలం జాగ్రత్త! పిడుగుపాటుకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వివరాలు 8లో u

జిల్లాలో వ్యవసాయ వార్షిక ప్రణాళిక రూ.7,542కోట్లతో సిద్ధమైంది. గతేడాదితో పోలిస్తే రూ.800కోట్లకుపైగా పెరిగింది. కానీ ఎన్నో ఆశలతో వానాకాలం సీజన్‌కు సిద్ధమవుతున్న జిల్లా రైతాంగానికి రుణ వితరణ వేగంగా జరిగితేనే మేలు జరగనుంది. ఈ దిశగా అధికారులు చొరవ చూపాల్సిన అవసరం ఉంది. – గజ్వేల్‌

సకాలంలో అందేలా చూస్తాం

రైతుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ప్రభుత్వం వార్షిక ప్రణాళిక సిద్ధం చేశాం. గతేడాదితో పోలిస్తే ప్రణాళికను ప్రభుత్వం పెంచింది. పంట రుణాలు సకాలంలో అందేలా చూస్తాం. వ్యవసాయానుబంధ రంగాలకు కూడా ప్రాధాన్యతనిస్తాం.

– హరిబాబు, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌

జిల్లాలో 3లక్షల మందికిపైగా రైతులు ఉన్నారు. వానాకాలం, యాంసగి సీజన్లకు సంబంధించి ఈఏడాది(2026–27) రూ.7,542 కోట్లకుపైగా రుణాలు ఇవ్వాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ మేరకు ఆమోదం కూడా లభించింది. వానాకాలం, యాసంగి సీజన్‌లకు సంబంధించి ఈ లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రతి మూడు నెలలకోసారి 25శాతం లక్ష్యం చేరుకోవాలని నిర్ణయించారు. గతేడాది రూ.6,700కోట్లకుపైగా లక్ష్యంగా ఉండగా.. రెండు సీజన్లు కలుపుకొని 74శాతం వరకు రుణాలు అందించారు. వ్యవసాయానుబంధంగా ఉండే సూక్ష్మ చిన్నతరహా రంగాలకు, వాణిజ్య రంగాలకు మరో రూ.1,675 కోట్లకుపైగా కేటాయించారు. జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్‌కు సంబంధించి 5.41 లక్షల ఎకరాలకుపైగా పంటలు సాగులోకి వస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే వరి 3.85 లక్షల ఎకరాల్లో సాగులోకి రానుందని అంచనా వేస్తున్నారు. పత్తి 1,18,772 ఎకరాలు, మొక్కజొన్న 28,027, కంది 7,431 ఎకరాల్లో కంది, మరో 14 ఎకరాల్లో పెసర్లు సాగులో రానుందని అంచనా వేస్తున్నారు. కానీ ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాలు సక్రమంగా కురవక విత్తన ప్రక్రియ ఆలస్యమైంది. ఇప్పటివరకు పత్తి విత్తనాలు మాత్రమే విత్తుతున్నారు. పత్తి 43,552 ఎకరాలకుపైగా సాగులోకి వచ్చింది. మొక్కజొన్న 3,842, కంది 544, వరి 308 ఎకరాలు సాగులోకి వచ్చాయి.

సకాలంలో అందితేనే మేలు

రుణ ప్రణాళిక సక్రమంగా అమలైతేనే రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది. జిల్లాలో రైతు బంధుతోపాటు పంటల పెట్టుబడి కోసం రుణాల పంపిణీ అత్యవసరం. కానీ కొన్నేళ్లుగా రుణమాఫీ వంద శాతం జరగక రైతుల రుణాలు రెన్యువల్‌ కావడంలేదు. ఫలితంగా కొత్త రుణాల పంపిణీ ఆలస్యమవుతోంది. ఈనేపథ్యంలో ఏటా రుణవితరణ లక్ష్యం తగ్గిపోతోంది. ఈసారైనా ఈ పరిస్థితి లేకుండా చూడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement