95.76 శాతం పంపిణీ
● తప్పనిసరిగా వేయించాలి ● కలెక్టర్ హైమావతి ● పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ
సిద్దిపేటకమాన్: ఐదేళ్లలోపు పిల్లందరికీ తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని ఎంపీ రఘునందన్‌రావు, కలెక్టర్ హైమావతి తెలిపారు. జిల్లా కేంద్రం సిద్దిపేట అర్బన్ నాసర్‌పూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో వారు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్నారుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని భావి భారత పౌరులను పోలియో రహితంగా ఉంచడానికి ప్రభుత్వం ఉచితంగా పోలియో చుక్కలు అందిస్తుందన్నారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. బూత్‌ల దగ్గర వేయగా మిగిలిన చిన్నారులకు వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేస్తారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలు 94,321మంది ఉన్నట్లు వంద శాతం వీరందరికి చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ ధనరాజ్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ వినోద్‌బాబ్జి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ దీప్తిప్రియాంక, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట ప్రగతి భేష్..
సిద్దిపేటజోన్: ‘సిద్దిపేట అభివృద్ధి ప్రత్యక్షంగా చూశాం. అన్ని రంగాల్లో ప్రగతి సాధించింది. ఇదే తరహాలో గద్వాల అభివృద్ధి కోసం కృషి చేస్తా’మని గద్వాల పాలకవర్గ సభ్యులు ప్రశంసించారు. ఆదివారం గద్వాల చైర్మన్ నర్సింహులు ఆధ్వర్యంలో కౌన్సిలర్లు సిద్దిపేట సందర్శించారు. సిద్దిపేట అధ్యయన కేంద్రంగా ఉందన్నారు. అంతకుముందు ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రైతు బజార్, స్వచ్ఛ బడి, తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీష్ రావును క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
జిల్లాలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో 95.76 శాతం పంపిణీ నమోదైంది. జిల్లాలో ఐదేళ్ల లోపు పిల్లలు 94,321 మంది ఉండగా బూత్ లెవల్ లో 90,319 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు.
గద్వాల పాలకవర్గ సభ్యులు ప్రశంస


