సిద్దిపేటరూరల్: అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన వివిధ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీసీ రోడ్లు, డ్రైనేజీ, అంగన్వాడీలు, వీఓ, జీపీ భవనాలు, పాఠశాలల్లో ప్రహరీల నిర్మాణం జరుగుతున్న క్రమంలో వాటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. భూగర్భజలాల పెంపునకు ఇంకుడుగుంతలు, ఊటకుంటలు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇప్పటివరకు 6,481 ఇందిరమ్మ ఇళ్ల స్లాబ్‌లు పూర్తి కాగా, మిగతా ఇళ్లను సైతం పూర్తి చేసేలా పనిచేయాలన్నారు. గుడిసెల్లో నివసిస్తున్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. అంతకుముందు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హెలెన్ కెల్లర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రమేశ్, డీఆర్‌డీఓ జయదేవ్‌ఆర్యా, డీపీఓ రవీందర్, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్, మిషన్ భగీరథ ఎస్‌ఈ వెంకట్‌రెడ్డి, డిప్యూటీ సీఈఓ ,మిషన్ భగీరథ ఈఈ తదితరులు పాల్గొన్నారు.
నేడే పల్స్ పోలియో..
సర్వం సిద్ధం: కలెక్టర్
సిద్దిపేటరూరల్: నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు ఎంతో ముఖ్యమని, 0–5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కల వేసే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ హైమావతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 28న పల్స్ పోలియోను జిల్లా వ్యాప్తంగా 94,321 మంది చిన్నారులకు వేసేందుకు 568 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆరోజు వేయించుకోని చిన్నారులకు ఆశాలు, అంగన్వాడీలు ఇంటింటికీ తిరిగి పొలియో చుక్కలు వేస్తారన్నారు. కార్యక్రమాన్ని విజయవంతానికి ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు అందరూ సహకరించాలన్నారు.
కలెక్టర్ హైమావతి
అధికారులతో కలెక్టర్ సమీక్ష


