వైభవంగా శనిత్రయోదశి మహోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా శనిత్రయోదశి మహోత్సవం

Jun 28 2026 7:24 AM | Updated on Jun 28 2026 7:24 AM

వర్గల్‌(గజ్వేల్‌): విద్యాసరస్వతి క్షేత్రం శనివారం శనిత్రయోదశి మహోత్సవ వైభవంతో అలరారింది. పోటెత్తిన భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే శనీశ్వరునికి భక్తజన సామూహిక తైలాభిషేకాలు, మరోవైపు సరస్వతిమాత సన్నిధిలో చిన్నారుల అక్షరస్వీకార పూజలతో క్షేత్రంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఆలయ వ్యవస్థాపక చైర్మన్‌ చంద్రశేఖరసిద్ధాంతి పర్యవేక్షణలో పరివారం భక్తులకు ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని, గణపతి, వెంకటేశ్వరుడు, లింగేశ్వరుడు, శనీశ్వరులను దర్శించుకుని తరించారు. క్షేత్రంలో 1000 పైగా తైలాభిషేకాలు జరిగినట్లు మేనేజర్‌ రఘుపవన్‌ పేర్కొన్నారు.

సర్‌పై అపోహలొద్దు

ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ విజయలక్ష్మి

దుబ్బాక: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై ప్రజలు ఎలాంటి అపొహలు పెట్టుకోవద్దని నియోజకవర్గం ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ విజయలక్ష్మి అన్నారు. శనివారం చేర్వాపూర్‌లో ‘సర్‌’ నిర్వహణ తీరుకు సంబంధించి మ్యాపింగ్‌ ఎన్యూమరేషన్‌ పత్రాల పంపిణీని తహసీల్దార్‌ మోతిసింగ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగించడం జరగదని అన్నారు. మృతి చెందిన, రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్న వారి పేర్లను తొలగించడం జరుగుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement