వరుణా.. కరుణ చూపవా.. | - | Sakshi
Sakshi News home page

వరుణా.. కరుణ చూపవా..

Jun 27 2026 7:24 AM | Updated on Jun 27 2026 7:24 AM

వర్షాలు కురవాలని జలాభిషేకం

వర్షాలు కురవాలని మహిళలు జలాభిషేకం చేశారు. శుక్రవారం హుస్నాబాద్‌ పట్టణంలోని కాశీ మరకత లింగేశ్వర దేవాలయంలో వరుణ దేవుడు కరుణించాలని ప్రత్యేక పూజలు చేశారు. బిందెలతో నీళ్లు తీసుకువచ్చి శివలింగానికి జలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ దండి లక్ష్మి మాట్లాడుతూ సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌ చిత్తారి పద్మ, మహిళలుపెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. – హుస్నాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement