బొట్టు బొట్టు సాగుకు పట్టి..
వానాకాలంలో చినుకు జాడ కరువైంది. పుడమిలో పడ్డ విత్తు మొలకెత్తాలంటే గగనంగా మారింది. దుక్కిలో విత్తుకున్న రైతులు వాన జాడకోసం దిక్కులు చూస్తున్నారు. విత్తనాలను మొలకెత్తించడానికి నానా అగచాట్లుపడుతున్నారు. వానపై ఆశలు చాలించుకున్న రైతులు డ్రిప్పు పైపులను పొలమంతా పరుచుకుంటున్నారు. బొట్టు బొట్టును ఒడిసి పడుతూ విత్తనాలను మొలకెత్తేలా చెమటోడ్చుతున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా డ్రిప్పుపైపులతో నీటి తడిని అందిస్తూ పంటలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. – మిరుదొడ్డి(దుబ్బాక)


