ఏసీపీ సదానందం
హుస్నాబాద్: విద్యార్థులు, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలని ఏసీపీ సదానందం పిలుపునిచ్చారు. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ యువత మత్తుకు బానిసై బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మత్తు పదార్థాలు విక్రయించడం నేరమని, వాటి రవాణాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. యువత చెడు అలవాట్లకు గురికాకుండా ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎస్సై లక్ష్మారెడ్డి, ట్రాఫిక్ ఎస్సై వెంకటేశ్వర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, విద్యార్ధులు పాల్గోన్నారు.


