సమావేశంలో మాట్లాడుతున్న ఏడీఏ వీణారెడ్డి
హుస్నాబాద్‌రూరల్: రైతులు సమగ్ర వ్యవసాయ విధానాన్ని అవర్చుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చని ఏడీఏ వీణారెడ్డి చెప్పారు. మీర్జాపూర్ రైతువేదికలో సోమవారం నిర్వహించిన సమావేశంలో రైతులకు సమగ్ర వ్యవసాయ విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం వల్ల జూన్ తర్వాత వర్షాలు పడే అవకాశం లేదన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని రైతులు వరి సాగుకాకుండా ఇతర పంటలవైపు మొగ్గుచూపాలని సూచించారు. పప్పుధాన్యాల సాగును ఎంచుకోవాలని, తక్కువ నీరుతో పంట చేతికి వస్తుందని మార్కెట్‌లో డిమాండ్ ఉండి గిట్టుబాటు ధరకూడా లభిస్తుందన్నారు. గ్రామాల్లో రైతులకు సేవలందించడానికి పల్లె మహిళా జీవనోపాధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. రైతులకు కావల్సిన సేవలను ఈ కేంద్రాల ద్వారా పొందవచ్చన్నారు. కార్యక్రమంలో సెర్ప్ డీపీఎం మధుసూదన్, ఏపీఎం తిరుపతి, ఏఓ పూజ, సర్పంచ్‌లు వేల్పుల సంపత్, మామిడి చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
ఏడీఏ వీణారెడ్డి


