సిద్దిపేటకమాన్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో వచ్చే నెలలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పలు కంపెనీల ప్రతినిధులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాబ్‌మేళాలో భాగస్వామ్యం కావడానికి ఇప్పటికే 20కి పైగా ప్రముఖ కంపెనీల ముందుకువచ్చాయన్నారు. 18 ఏళ్లు నిండిన యువత హాజరుకావాలని సూచించారు. విద్యార్హతలకు అనుగుణంగా అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆసక్తి గలవారు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.
16ఎస్‌డీపీ121:


