మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

Mar 15 2026 6:45 AM | Updated on Mar 15 2026 6:45 AM

గజ్వేల్‌రూరల్‌: మహిళలకు సమాన అవకాశాల కోసం చేపట్టిన పోరాటాలతో పుట్టిందే అంతర్జాతీయ మహిళా దినోత్సవమని సీఐటీయూ, యూటీఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ సంఘాల నాయకులు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం గజ్వేల్‌ పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కుటుంబంలో పిల్లలు లింగ వివక్షత లేకుండా సమానంగా పెంచాలని, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చినపుడే ఆర్థిక స్వాతంత్య్రం, గౌరవం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్‌కే వలీ, జిల్లా కార్యదర్శి వెంకటకిరణ్‌, ప్రభావతి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement