గజ్వేల్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మైనార్టీల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. శుక్రవారం రాత్రి గజ్వేల్‌లోని మదీన మసీద్‌లో బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ హయాంలోనే మైనార్టీలకు సముచిత స్థానం కల్పించామని గుర్తు చేశారు. కేసీఆర్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో పెద్దపీట వేశారని తెలిపారు. విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో ఎన్నో అవకాశాలను కల్పించామన్నారు. ప్రత్యేకించి గజ్వేల్ నియోజకవర్గంలో వేలాది కోట్లతో అభివృద్ది కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్.. అబద్దపు మాటలతో కాలంవెళ్లదీస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ వైఫల్యాలను నిలదీయాల్సిన అవసరముందన్నారు. వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా ముస్లింలకు మంచి జరగాలని ఆకాంక్షించారు. మైనార్టీలకు బీఆర్‌ఎస్ ఎప్పుడూ తోడుగా ఉంటుందన్నారు. కేసీఆర్ కృషి వల్ల గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. ఈ ప్రాంతానికి ఒరగబెట్టిందేమీలేదన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ గజ్వేల్ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్‌మీరా, మజీద్ కమీటీ మాజీ అధ్యక్షుడు యూసుఫొద్దీన్, మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకుడు విరాసత్‌అలీ, గజ్వేల్ మార్కెట్ కమీటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం మాజీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీ రవీందర్, మాజీ జెడ్పీటీసీ మల్లేశం, బీఆర్‌ఎస్ నాయకులు గంగిశెట్టి రవీందర్, కళ్యన్‌కర్ నర్సింగరావు, గజ్వేల్ మండల శాఖ అధ్యక్షుడు బెండె మధు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు
గజ్వేల్‌లో బీఆర్‌ఎస్ నేత
వంటేరు ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు


