బల్దియా కొరడా... | - | Sakshi
Sakshi News home page

బల్దియా కొరడా...

Mar 13 2026 9:05 AM | Updated on Mar 13 2026 9:05 AM

సిద్దిపేటజోన్‌: నిబంధనలు అతిక్రమించిన వారికి మున్సిపల్‌ అధికారులు జరిమానా విధించారు. గురువారం కమిషనర్‌ ఆశ్రిత్‌ కుమార్‌ పట్టణంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల బిర్యానీలో బొద్దింక వచ్చిందనే ఫిర్యాదు మేరకు హయత్‌ రెస్టారెంట్‌ నిర్వహకులకు రూ.15 వేలు జరిమానా విధించారు. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ ప్రాంతంలో బహిరంగ మల విసర్జన చేసిన ఇరువురికి జరిమానా విధించారు. బృందావన్‌ గ్రాండ్‌ హోటల్‌ ఆకస్మికంగా తనిఖీ చేసి కాల పరిమితి దాటినా సరుకులు ఉండటాన్ని గమనించి రూ.15 వేలు జరిమానా విధించారు. ఆయన వెంట మున్సిపల్‌ అధికారులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement