చేర్యాల(సిద్దిపేట): పెంచిన వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్ కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ పట్టణ కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ఖాళీ గ్యాస్ సిలిండర్‌తో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 12 ఏళ్లలో అనేక సార్లు వంట గ్యాస్ ధరలు పెంచిందన్నారు. ప్రస్తుతం యుద్ధం పేరుతో గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ రూ.60వేల కోట్ల భారాన్ని దేశ ప్రజలపై వేయడాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలన్నారు. ధరలను ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు భూమయ్య, భాస్కర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రజిత, సుదర్శన్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.


